Terrible incident | అత్తను చంపిన అల్లుడు..

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను అల్లుడు కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం తారకరామ నగర్ లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. 80 ఏళ్ల పోల మంగమ్మను ఆమె అల్లుడు కేదారి పుల్లయ్య (60) వేట కొడవలితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అత్త-అల్లుడి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆస్తి లేదా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
