26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News

26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News
- 26 ఓడలు బిక్కుబిక్కు
- దక్షిణ కొరియా ఉక్కిరి బిక్కిరి
- రంగంలోకి ప్రత్యేక రాయబారి
- కువైట్ మాజీ రాయబారికి కొత్త బాధ్యతలు
(ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)
26 South Korea Ships : దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌కు ఒక కొత్త ప్రత్యేక రాయబారిని నియమించింది, ఆయన త్వరలో టెహ్రాన్‌కు వెళ్లనున్నారని దక్షిణ కొరియా అధికారిక యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

26 South Korea Ships : కువైట్ మాజీ రాయబారి చుంగ్ బ్యుంగ్-హా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. పశ్చిమ ఆసియా మీదుగా దక్షిణ కొరియా నౌకలు, ప్రజల సురక్షిత ప్రయాణాన్ని సమన్వయం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం చుంగ్ నియామకాన్ని ప్రకటించారు. ఈ నివేదిక ప్రకారం, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో దక్షిణ కొరియాకు చెందిన 26 నౌకలు చిక్కుకుపోయాయి. ఈ స్థితిలో ఇరాన్ తో సఖ్యతనే దక్షిణ కొరియా కోరుతోంది. ఇప్పటి వరకూ అమెరికా మిత్ర రాజ్యంగా ముద్ర వేయించుకున్న దక్షిణ కొరియా తాజాగా ఇరాన్ తో సఖ్యత ఫార్ములాతో ముందుకు వెళ్తోందని విశ్లేషకుల అంచనా.
