సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి

సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి
- ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆశాభావం
బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని నరసాయపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ పనులు శ్రీవారి దివ్య కృపాకటాక్షాలతో త్వరలోనే పూర్తి అవుతాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆకాంక్షించారు. గురువారం ఉదయం ఆయన ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పిల్లర్స్ నిర్మాణ పనులను తన చేతుల మీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక చింతన, భక్తి భావం అభినందనీయమని, ఆలయ నిర్మాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాపట్లకు చెందిన ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళి కృష్ణ, గంటా చిన్న, వీర భద్రరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ, రెడ్డి నాగరాజు, పిన్నిబోయిన శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు నాగేంద్ర, అడపా రామిరెడ్డి, సుధాకర్, కళ్ళం సారధి తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు. కళ్ళం సాయి సేవ ట్రస్ట్ ప్రతినిధి కళ్ళం హరినాథ రెడ్డి, కమిటీ సభ్యులు కలిసి వచ్చిన భక్తులకు, గ్రామ ప్రజలకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ నిర్మాణ పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

