ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు

ఉర్దూ పాఠశాలలో ఆకట్టుకున్న వార్షికోత్సవ వేడుకలు


ఊట్కూర్, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) :
ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధనలో చేపట్టడం జరుగుతుందని ఊట్కూర్ మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. విద్యార్థులు చేపట్టిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విద్యార్థుల తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వార్షికోత్సవ వేడుకలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను చదువుతోపాటు వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలనిఅన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోనే వార్షికోత్సవ వేడుకలు చేపట్టేవారని ప్రభుత్వ పాఠశాలలో అందుకు దీటుగా వార్షికోత్సవం నిర్వహించి విద్యార్థుల సామర్ధ్యాలను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆటపాటలతో ఆధ్యాంతం సందేశాత్మక ప్రదర్శనలు చేపట్టి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలోకాంప్లెక్స్ హెచ్ఎం కుసుమ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సలాం, వార్డు సభ్యులు ఈనా పర్వీన్ ముజాహిద్, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply