Former Minister | రైతులను కలవకుండా…

Former Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఇవాళ‌ ఉదయం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులను కలిసేందుకు ఆయన వెళ్లాల్సి ఉండగా, ముందస్తు చర్యగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు స్వాధీనం చేసుకోవద్దని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు హరీశ్‌రావు పర్యటన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ పర్యటనను నిరోధించేందుకు పోలీసులు బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు విధించారు.

హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇదే సమయంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

Leave a Reply