పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

పిడుగుపాటుకు ఇద్దరు మృతి..
దర్శి, ఆంధ్రప్రభ : దర్శి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. దర్శి మండలంలోని సామంతపూడి గ్రామంలో ఆవుల మల్లికార్జున, ముళ్ళమూరు మండలం పసుపుగల్లులో రావులపల్లి శివకృష్ణ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ వారి నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఇరువురి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పార్టీ తరఫున కూడా తమ మద్దతు ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
