ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషిచేస్తా….

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషిచేస్తా….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములుఅన్నారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు.
వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేందుకు బలవర్తకమైన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు నిర్వహించే వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినిత్యం యోగా ధ్యానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా వంతంగా ఉండవచ్చనిఅన్నారు. వైద్య శిబిరంలో వివిధ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమత, పంచాయతీ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.
