ఘనంగా డాక్టర్ వి.మధు ప్రధమ వర్ధంతి…

ఘనంగా డాక్టర్ వి.మధు ప్రధమ వర్ధంతి…

భవానిపురం, ఆంధ్రప్రభ : సిపిఎం ,ప్రజానాట్యమండలి సభ్యులుగా,హోమియోపతి వైద్యునిగా డాక్టర్ వి.మధుమోహన రాజు(మధు) ప్రజలకు, పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని వక్తలు కొనియాడారు. డాక్టర్ వి.మధు ప్రథమ వర్ధంతి సందర్భంగా వన్ టౌన్ టి పి రోడ్డు పంచముఖ ఆంజనేయస్వామి గుడి ఎదురు తాను గతంలో నడిపిన ప్రజా హోమియో వైద్యశాల సమీపంలో శిష్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ముందుగా డాక్టర్ వి మధు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టు(సిపిఎం) యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య, సీతారాం ఏచూరి వారి ఆశయ స్ఫూర్తితో ప్రజానాట్యమండలి సభ్యునిగా అనేక ప్రజా సమస్యలపై వీధి నాటకాలతో ప్రజలను చైతన్య పరచడంతో పాటు ఇటు తన వైద్యంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత హోమియో వైద్యాన్ని తన చివరి శ్వాస వరకు అందించి వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తన కుమారుడు విప్లవ కుమార్, శిష్యులు పిల్ల అశోక్,తాడికొండ వెంకటరావు,ముక్కాల నరసింహారావు, వానపల్లి పరుశురాం, రాజు, బి.ప్రతాప్, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply