బాసరలో ఆర్జిత సేవలు రద్దు..

బాసరలో ఆర్జిత సేవలు రద్దు..

బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసర ఆలయంలో 225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని అమ్మవార్లకు అభిషేక సేవ నిర్వహించి అనంతరం మధ్యాహ్నం వరకు కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు, సత్యనారాయణ వ్రతాలు, నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటనలో కోరారు.

Leave a Reply