బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తుగా అరెస్టు

గట్టుప్పల, ఆంధ్రప్రభ : హైదరాబాదులోని సీఐడీ కార్యాలయ ముట్టడికి బిఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను శనివారం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో నారని జగన్,సంఘరి స్వామి,అందే రామచందర్,పెదగాని శ్రీను,ఎండి జలాలుద్దీన్,చిలుకూరి అంజయ్య,బిపిఎల్ గౌడ్,తీగుళ్ల ఈశ్వరప్ప,చిలువేరు అయోధ్య,నీల నరసింహ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు.
