గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమైక్య సంఘ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అద్దంకి రామలింగయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మందుల బీరప్ప,ఉప సర్పంచ్ మందుల అంజయ్య,వార్డు సభ్యులు దండు లింగయ్య,పోలేపల్లి సుజాత,బోడిశ మల్లేష్, అద్దంకి వెంకన్న, చింతపల్లి సుశీల,బొల్లం యాదయ్య,మాదిరెడ్డి దేవకమ్మ,వల్లూరు నరేష్,గ్రామ సమైక్య అధ్యక్షురాలు జయశ్రీ,వీవో బి.రామదాసు తదితరులు పాల్గొన్నారు.