Andhra Prabha SPL Story | శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త టెక్నాలజీ..

Andhra Prabha SPL Story | శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త టెక్నాలజీ..
Andhra Prabha SPL Story | టోక్యో సకానా ఏఐ సంస్థ రూపొందించిన ఏఐ సైంటిస్ట్
శాస్త్రవేత్తలా పనిచేసే కృత్రిమ మేధ వ్యవస్థ
పరిశోధనా పత్రాలను స్వతంత్రంగా తయారు చేసే సామర్థ్యం
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఏఐ సైంటిస్ట్ వివరాలు
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఏఐ సైంటిస్ట్ ప్రయోగం
టెక్నాలజీపై నిపుణుల ఆశ్చర్యం మరియు ఆందోళనలు
భవిష్యత్తులో ఏఐ సైంటిస్ట్ ప్రభావం
Andhra Prabha SPL Story | ఏఐ సైంటిస్ట్! ఔను.. కృత్రిమమేధ.. కృత్రిమ సైంటిస్టులను సృష్టిస్తోంది. టోక్యోకు చెందిన ఏఐ సంస్థ ఏఐ సైంటిస్ట్‌గా చెప్పే ఒక సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. నిజమైన శాస్త్రవేత్తలు ఎలా పని చేస్తారో.. ఇంచుమించు అదే మాదిరిగా ఈ ఏఐ సైంటిస్ట్ పని చేస్తూండటం విశేషం. టోక్యోలోని పరిశోధనా సంస్థ సకన ఏఐ ఈ ఏఐ సైంటిస్ట్ సిస్టమ్‌ను తయారు చేసింది. ఈ మిషన్ నిజమైన శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రాలు ఎలా రాస్తారో , పరిశీలిస్తారో, ఆమోదిస్తారో.. అచ్చం అలానే, స్వతంత్రంగా, విజయవంతంగా, మానవ సహాయం లేకుండా పూర్తి చేసి నివ్వెరపరచింది. సకానా సంస్థ అంచనా ప్రకారం ఏఐ సైంటిస్ట్ మునుముందు పరిశోధనాంశాలను, ఆలోచనలను, ప్రయోగాలను స్వతంత్రంగా నిర్వహిస్తుంది. కోడింగ్ రాయడం, ఫలితాలను విశ్లేషించడం, పరిశోధనా పత్రాలను తయారు చేయడం వంటి పనులన్నీ స్వతంత్రంగా నిర్వహిస్తుంది. చివరకు అది చేతిరాతతో కూడిన పరిశోధనా పత్రాలను కూడా సృష్టిస్తుంది.
ఏఐ సైంటిస్ట్‌కు సంబంధించిన వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఇప్పటికే జరిగిన పరిశోధనలకు సంబంధించిన సాహిత్యాన్ని, పరిశోధనా పత్రాలను నిశితంగా పరిశీలిస్తుంది. అందులోని సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ తరువాత ప్రయోగాలపై నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే కోడింగ్ అభివృద్ధి చేసి ప్రయోగాలు చేస్తుంది. ఫలితాలను విపులంగా రాసుకుంటుంది. తన పరిభాషలో పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేస్తుంది. చివరి దశలో ఏఐ రివ్యూయర్‌తో విశ్లేషణ చేయిస్తుంది. అందులోని స్పష్టత, కచ్చితత్వం, ఒరిజినాలిటీని నిర్ధారిస్తుంది. అంతా ఓకే అయ్యాక చేతిరాతతో పరిశోధనా పత్రాన్ని రూపొందిస్తుంది.
సకానాకు చెందిన బృందం ఏఐ సైంటిస్ట్ పనితీరును 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రయోగాత్మకంగా చూపించింది. వర్క్‌షాప్‌కు వచ్చిన నిపుణులకు మూడు పరిశోధనా పత్రాలను అందజేశారు. వాటిలో ఒకదానిని నిపుణులు ఆమోదించారు. దానికి 6,7,6 మార్కులు కేటాయించారు. అయితే, ఆ నివేదిక ఏఐ సైంటిస్ట్ రూపొందించినదని ముందుగా చెప్పలేదు. తర్వాత తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అనంతరం పరిశోధనా పత్రాన్ని వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ సాంకేతికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెక్నాలజీ దుర్వినియోగమైతే ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ సైంటిస్ట్ ఒక పరిశోధనా పత్రాన్ని 15 గంటల్లో రూపొందించగలదు. మానవ సైంటిస్టులతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమయం.
