Peddi | ఆ ఛాన్స్ ఇస్తుందా..?

Peddi | ఆ ఛాన్స్ ఇస్తుందా..?
Peddi | తరుణ్ భాస్కర్ – నిఖిల్ మూవీస్ రెడీ
సమంత ఎంట్రీతో పోటీ మరింత హీట్
నాగవంశీ మూవీస్ కూడా లైన్లో
పెద్ది నిర్ణయంపై ఇండస్ట్రీలో ఉత్కంఠ
Peddi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినిమా నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఆరు నెలల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. కరెక్ట్ టైమ్ కి రిలీజ్ కావడం లేదు. దీంతో ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే.. మిగిలిన సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తుందా..? రాదా..? అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే.. పెద్ది పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తుండడంతో ఆ డేట్ కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. ఇంతకీ.. ఆ ఐదు సినిమాలు ఏంటి..?
Peddi | మే 1 కోసం తరుణ్ భాస్కర్, నిఖిల్..

పెద్ది ఏప్రిల్ 30న రాకపోతే.. మా సినిమా రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించారు గాయపడ్డ సింహం మూవీ మేకర్స్. తరుణ్ భాస్కర్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇక గాయపడ్డ సింహం తర్వాత మే 1కి రెడీ అంటున్న మూవీ స్వయంభు. నిఖిల్ నటించిన భారీ చిత్రమిది. ఈ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీమ్ కూడా సినిమా సక్సెస్ పై నమ్మకంగా ఉంది. అయితే.. పోటీ లేకుండా సోలో డేట్ కోసం చూస్తుంది.
Peddi | నేనూ రెడీ అంటున్న సామ్..

ఇక మే 1 రావాలని చూస్తున్న మరో సినిమా మా ఇంటి బంగారం. సమంత నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి నందినీ రెడ్డి డైరెక్టర్. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. కంటెంట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న సామ్.. రెండు వారాలు ముందుగా మే 1న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందని సమాచారం. బేబీ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మూవీ ఎపిక్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.
Peddi | లైన్లో నాగవంశీ..

అలాగే అశోక్ గల్లా నటిస్తున్న వీసా సినిమాని కూడా మే 1న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాని కూడా నాగవంశీనే నిర్మిస్తున్నారు. చేతిలో నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. అందుచేత ఫస్ట్ కాపీ రెడీ చేసుకోవాలి.. సెన్సార్ వర్క్, ప్రమోషన్స్..ఇలా చాలా వర్కే ఉంది. అందుకనే.. ఈ సినిమాలు అన్నీ.. పెద్ది నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా చరణ్ రాకాస ప్రమోషన్స్ లో పెద్ది వాయిదా ఏమీ లేదన్నట్టుగా చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది వచ్చే ఛాన్స్ లేదన్నట్టుగా వినిపిస్తోంది. దీంతో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరి.. పెద్ది వస్తుందో లేదో.. ఆ డేట్ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో ఏ ఏ సినిమాలు వస్తాయో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

