నాలుగో వార్డులో పదేళ్ల నీటి సమస్య తీర్చిన సర్పంచ్….

నాలుగో వార్డులో పదేళ్ల నీటి సమస్య తీర్చిన సర్పంచ్….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ నాలుగో వార్డులో సర్పంచు కొల్లంపల్లి అంజయ్య గత పది ఏళ్ల నుండి నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని ఎట్టకేలకు బుధవారం పరిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు పారిశుద్ధ్యం పనులు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తానన్నారు. ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలనికోరారు.
వార్డు సభ్యుడు గుడిసె చిన్నరాజు మాట్లాడుతూ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తో మాట్లాడి పైపు లైన్ కు భూమిపూజ చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వార్డ్ ప్రజలు త్రాగునీటి సమస్య తీరడంతో హర్షం వ్యక్తం చూస్తూ ధన్యవాదాలుతెలిపారు. త్రాగునీరు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి,వార్డ్ సభ్యులునేడుగం రాఘవేంద్ర, చెన్నా రెడ్డి,వెంకటేష్ గౌడ్,నాయకులు పత్తి ఆంజనేయులు, అశోక్, నరేష్, గుంతలి నర్సింహా, తిరుపతి, కె. బి. నరేష్, సప్పటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
