జిల్లా జడ్జ్ ని కలసిన దమ్మపేట బార్ అసోసియేషన్
జిల్లా జడ్జ్ ని కలసిన దమ్మపేట బార్ అసోసియేషన్
దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ను దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ బార్ అసోసియేషన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దమ్మపేట జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా దమ్మపేట కోర్ట్ కు కావలసిన సిబ్బంది, సమస్యల గురించి ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొంది మురళీ మోహన్, ఉపాధ్యక్షులు ముప్పిడి శ్యామ్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్రబాబు, కార్యదర్శి తుమ్మ రాంబాబు, కోశాధికారి తామ బాలరాజు, న్యాయవాదులు కాలం సంధ్యారాణి, గోళ్ళ భవానీ కృష్ణ యాదవ్, షేక్ దర్గావలి, నల్లపు ఉదయ్ కుమార్ గద్దల అప్పారావు తదితరులు వున్నారు.
