పలు హోటళ్లలో 11 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

పలు హోటళ్లలో 11 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పలు హోటళ్లలో అక్రమంగా నిల్వ చేసిన 11 డొమెస్టిక్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు.ఈ సందర్భంగా నిజామాబాద్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ హోటల్ నిర్వాహకులు అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను నిల్వ చేయడంతో 11 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు 7 గురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హోటళ్ల నిర్వాహకులు అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను నిల్వ చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో అధికారులు వినోద్,ప్రవీణ్, పోలీస్ సిబ్బంది వాల్మీకి గౌడ్, ఓపివోస్ శ్రీకాంత్, గంగాధర్, అజయ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply