పేదల సొంతింటి కలను సాకారం….

పేదల సొంతింటి కలను సాకారం….

టిడ్కో గృహాల సామూహిక గృహప్రవేశం..
కూటమి ప్రభుత్వ నిబద్ధతకు ఇదో నిదర్శనం..

పటమట, ఆంధ్రప్రభ : పేదల ఇళ్ల సమస్యను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం మాత్రమే వినియోగించుకుందని టిడ్కో గృహాలను పూర్తి చేయకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేసిందని కూటమి ప్రభుత్వం తిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. సోమవారం జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో గృహాల సమూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొత్త ఇళ్లలో ప్రవేశించిన లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలుసుకుని వారితో మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం సెంట్ భూమి పేరుతో ఇచ్చిన స్థలాలు మౌలిక సదుపాయాలు లేవని, వర్షం వస్తే మునిగిపోయావని అన్నారు. జగన్ ఇచ్చిన స్థలాలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొనేవారన్నారు.

2014-2019 మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నిర్మించిన టిడ్కో గృహాలు నాణ్యతతో, అన్ని సౌకర్యాలతో నిర్మించబడ్డాయని, చంద్రబాబు కట్టిన టిడ్కో గృహాలకు జగన్ ఇచ్చిన సెంటు స్థలాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, ప్రజలకు ఆ తేడా తెలియకూడదనే కావాలనే జగన్ టిడ్కో గృహాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గద్దె అనురాధ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 2,50,893 టిట్కో గృహాలు అన్నింటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి గృహప్రవేశం చేస్తున్నామని ఇది చంద్రబాబు నాయుడు సంకల్పానికి, కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, సంవత్సరాలుగా ఎదురుచూసిన సొంతింటి కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నరన్నారు. గతంలో ఇళ్ల కోసం ఎదురుచూసిన కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు తమ కుటుంబాలకు భద్రమైన నివాసం లభించడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పారన్నారు.

Leave a Reply