పరకాలలో బీజేపీ నేతల రక్తదానం..

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం హన్మకొండ ఎంజీఎం హాస్పిటల్‌లో రక్త యూనిట్ల నిల్వలు 100 కంటే తక్కువగా ఉండటంతో వెంటనే స్పందించారు.

భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో, పరకాల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ విభాగంలో సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ సహకారంతో బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ రక్తదానం చేసిన బీజేపీ నాయకులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

Leave a Reply