9 Maoists Surrender : ఏపీలో మావోల క‌థ స్వస్తి Anadhra Prabha Latest News

9 Maoists Surrender : ఏపీలో మావోల క‌థ స్వస్తి Anadhra Prabha Latest News

  • 9 మంది మావోయిస్టులు జనం బాట
  • కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు స‌హా కీలక కేడర్ సరెండర్..
  • ఇక ఏపీ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్
  • డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

9 Maoists Surrender

9 Maoists Surrender : ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట మొత్తం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్తం లచ్చు ( పి ఎల్ జి ఏ బెటాలియన్), పోడియం రాజే ( పి పి సి ఎం, ఏ సీఎం ), కర్తం అడమే ( పి పి సి ఎం , ఏ సీఎం ), ముచ్చిక మాస ( ఏసీఎం పిపిసిఎం ) మడవి జోగీ ( పి పి సి ఎం ఏ సీఎం ), ముచ్చిక లక్ష్మణ్ ( పి ఎం ), మడవి ఆడమ ( పీఎం ఏపీఎల్జే బెటాలియన్), కడితి హుర్రే ( పి ఎం ) పోలీసుల ఎదుట లొంగిపోయారు.

9 Maoists Surrender : ఇక మావోల క‌థకు తెర

9 Maoists Surrender

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఈ లొంగుబాటుతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు పూర్తిస్థాయి ముగింపు దశ చేరిందని ప్రకటించారు. “ఇకపై ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ ఫ్రీ రాష్ట్రంగా నిలుస్తుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉండదు” అని స్పష్టం చేశారు.

9 Maoists Surrender

మార్చి 31లోపు లొంగిపోవాలని ఇచ్చిన గడువు నేపథ్యంలో అనేక మంది ముందుకు వచ్చారని తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటుకు ఏపీ పోలీసులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ , గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు సమన్వయంతో కృషి చేశాయని డీజీపీ వెల్లడించారు. శాంతియుత సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

9 Maoists Surrender : గణపతి పై నో కామెంట్​

9 Maoists Surrender

రాష్ట్రానికి చెందిన కొంతమంది మావోయిస్టులు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని, గణపతి అంశంపై స్పందించబోనని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా, 106 మంది లొంగిపోయారని, అండర్‌గ్రౌండ్‌లో ఉన్న 15 మంది క్యాడర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 36 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన చెల్లూరు నారాయణరావు లొంగుబాటు ఈ పరిణామంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. సాధారణ జనజీవనంలో కలిసిపోయేందుకు ఈ కేడర్ ముందుకు రావడం రాష్ట్రంలో శాంతి భద్రతలకు అనుకూల సంకేతంగా అధికారులు పేర్కొంటున్నారు.

ALSO : Maoist Strategy Failure : అదే మూస ప‌ద్ద‌తే Andhra Prabha Latest News

Leave a Reply