జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్…

జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్…
మొదటి పూట కన్నాలు…
42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం..
సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు…
కర్ణాటక రాష్ట్రంలోనూ కేసులు…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జల్సాలకు అలవాటు అలవాటుపడి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్, నంద్యాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిదిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి ని అరెస్టు చేసి 42 తులాల బంగారు ఆభరణాలు స్వాదినం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. ఆదివారం పత్రిక సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెంగళూరు పట్టణానికి చెందిన వినాయక నగర్ గద్దెల హళ్లి మసీదు దగ్గర నివాసం ఉండే 38 సంవత్సరాల సొహైల్ ఖాన్, అలియాస్ సమీర్ ఖాన్ అలియాస్ సోహెబ్ బిన్ మునాఫ్ ఖాన్ అలియాస్ జహీర్ ఖాన్ అనే వ్యక్తిని ఆత్మకూరు నుంచి వెలుగోడుకు వెళ్ళు దారిలో ఎస్సార్ బీసీ కెనాల్ ప్రక్కన చెట్ల కింద అదుపులోకి తీసుకోవటం జరిగిందని తెలిపారు.
వారు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 106/2025 యు /ఎస్ 331 (3), 305 (a) బి ఎన్ ఎస్ యాక్ట్ మేరకు, నంద్యాల -1 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 32/2025 యు /ఎస్ 331 (3) 305 బి ఎన్ ఎస్ యాక్ట్ మేరకు కేసు నమోదు చేశారని తెలిపారు. రికవరీ కాబడిన సొత్తు వివరాలను తెలిపారు.ఆత్మకూరు కేసులోబంగారు కాసుమాల 10 తులాలు, బంగారం లాంగ్ చైన్, కమ్మలు 7. 5 తులాలు, బంగారు చిన్న హారం కమ్మలు 5 తులాలు, బంగారు రాళ్ళ గాజులు 6 తులాలు, రెండు బంగారం బ్రాస్ లెట్స్ 4 తులాలు,

ఒక పెద్ద బంగారు నెక్లెస్ 4 తులాలు,బంగారు కెంపుల పథకం చైన్ 3. 5తులాలు తూకం మొత్తం బంగారు ఆభరణాల తూకం సుమారు 40 తులాలతో పాటు నంద్యాల 1 టౌన్ కేసులో 4 బంగారు కమ్మలు,3 బంగారు రింగులు, రెండు బంగారు చెవి దుద్దులు రెండు కేసులలో కలిపి మొత్తం 42 తులాల బంగారు ఆభరణాలు విలువ సుమారు 65 లక్షలు సీజ్ చెయ్యడమైనదని తెలిపారు. 2025వ సంవత్సరంలో ఆత్మకూర్, నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో పగటిపూట కన్నపు దొంగతనాలకు పాల్పడుతూ పోలీస్ లకు దొరకకుండా తప్పిoచుకొని తిరుగుతున్న ఈ వ్యక్తిని ఆదివారం జిల్లాలోని ఆత్మకూర్ నుండి వెలుగోడుకు వెళ్ళుదారిలో వెలుగోడు వద్ద గల ఎస్ ఆర్ బి సీ కెనాల్ ప్రక్కన గల చెట్ల క్రింద అదుపులోకి తీసుకొవడం జరిగిందన్నారు.

జల్సాలకు అలవాటు ఆత్మకూర్, నంద్యాల టౌన్ నందు పగటి పూట కన్నపు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును వెలుగోడు దగ్గర గల ఎస్ ఆర్ బి సీ కెనాల్ దగ్గర దాచిపెట్టినాడన్నారు.ఇతనిపై గతంలో కూడా కుప్పం, పెనుకొండ, కర్ణాటక రాష్ట్రంలోని పెన్షన్ మొహాళ్ల పోలీస్ స్టేషన్ పరిదిలలో కేసులు ఉన్నాయని తెలిపారు. పెన్షన్ మొహాళ్ల పోలీస్ స్టేషన్ లోని కేసులలో జైలుకు వెళ్ళి వచ్చినాడన్నారు.
ఇతను చాలా రోజుల నుండి ఆత్మకూర్, నంద్యాల కేసులలో ముద్దాయి అయినప్పటికి ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతు నేరాలు చేస్తూ ఉన్నాడని తెలిపారు. పై కేసులను చేదించేందుకు కర్నూలు రేంజ్ డి ఐ జి కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాలమేరకు, ఆత్మకూర్ సబ్ డివిజన్ డీస్పీ రామంజీనాయక్ ఆద్వర్యంలో ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ మహేశ్వర రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ , ఆత్మకూర్ ఎస్ ఐ నారాయణ,ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హెచ్ సి 2641 పీసీ 2433, సీసీఎ స్ సిబ్బంది హెచ్ సీ 1038, పీసీ లు 344, 2944, 1822, పీసీ 3057 లు ప్రత్యేక బృందంగా ఏర్పడి ముద్దాయి కొరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయిని అరెస్ట్ చెయ్యడం జరిగిందన్నారు. దొంగతనం కేసులో ముద్దాయిని కనుగొని అరెస్ట్ చేయుటలో పై సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
