29marcheditorial | భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు..

29marcheditorial | భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు..

29marcheditorial | పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంపై ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యలు..
దీర్ఘకాలిక వ్యూహంతోనే పరిష్కారం..

29marcheditorial | అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న నెపంతో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధం ఇప్పటికిప్పుడు ముగుస్తుందన్న సూచనలేమీ లేవు. ఒకవేళ ముగిసినా ఆ యుద్ధం విసిరిన సవాళ్లు, ప్రభావం కొన్నేళ్లపాటు చూపుతాయి. ఈ నేపథ్యంలో ఒక దీర్ఘకాలిక, నిర్మాణాత్మక వ్యూహంతో పని చేస్తేనే ఆ సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధం విసిరిన సంక్షోభం ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. అది నేరుగా ప్రపంచదేశాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో చమురు రవాణాలో 20 శాతం సాగే హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేయడంతో ప్రపంచ దేశాలు ప్రభావితమవుతున్నాయి. 140 కోట్ల జనాభాతో అభివృద్ధి దూసుకుపోతున్న భారతక్కు.. ఈ యుద్ధంసవాలుగా మారింది. ఇంధన రంగంలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్థికరంగ వృద్ధి మందగించే సూచనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

29marcheditorial
29marcheditorial

సామాన్యులపై ఇప్పటికే ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది. మరో వైపు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై భయాలు వెంటాడుతున్నాయి. ఇది కృత్రిమ కొరతకు దారిస్తోంది. ఫలితంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత భరోసా కల్పిస్తున్నా వారు విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు దేశం ఎలా కలసికట్టుగా స్పందించిందో, అదే స్ఫూర్తితో.. టీమ్ ఇండియా భావనతో ముందుకువెళ్లాలని ప్రధాని సూచించడం సబబే. ఇరాన్ యుద్ధం విసిరిన సవాలు అంత తీవ్రమైనది. అందుకే ఆర్భాటం లేకుండా, వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయి కలపాలి. ప్రధానంగా ఇంధన భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. హార్మూజ్ జలసంధి నుంచి భారత్ నౌకలు సాఫీగా రావడానికి దౌత్యమార్గాన ప్రభుత్వం ప్రయత్నించి విజయం సాధించింది. మరో వైపు రష్యా సహా 40 దేశాల నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును ప్రారంభించింది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర భరోసా ఇస్తోంది. మరోవైపు ఆర్థికరంగం దెబ్బతినకుండా అప్రమత్తమైంది.

ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి ఎగుమతి, దిగుమతులు, సరఫరా గొలుసుకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకుండా వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఎరువులపై సబ్సిడీలు పెంచి రైతులకు ఊరటనిచ్చింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు చర్యలు తీసుకుంది. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగింది. హార్మోజ్లో ఇరుక్కున్న 22 భారతీయ నౌకలు, 600మంది సిబ్బందిని తీసుకువచ్చేందుకు ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఇరాన్ యుద్ధం ప్రభావం కొన్నేళ్లపాటు ఉంటుంది. ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడుల ఫలితమిది. అటు రష్యా కూడా గ్యాసోలిన్, పెట్రో ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తేనే ప్రజలకు భరోసా కలుగుతుంది. ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలున్న భారత్, ఇటు ఇరాన్తో వ్యూహాత్మకంగా వ్యవహరించి.. యుద్ధం వేళ తటస్థంగా ఉండటం కలిసొచ్చింది.

click here to read more

click to read prabhanews.com

Leave a Reply