చెన్నూరులో కోతుల నివారణ చర్యలు షురూ

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలో నెలకొన్న కోతుల సమస్యను పరిస్కారించేందుకు మున్సిపల్ అధికారలు నేటి నుంచి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గత మూడు రోజుల క్రితం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పట్టణంలో కోతుల సంచారం విచ్చలవిడిగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మెజార్టీ సభ్యులు పేర్కొనడంతో చెర్ పర్శన్ పెద్దింటి పద్మ సమావేశ మొదటి తీర్మానంలో పట్టణంలో నెలకొన్న కోతుల సమస్య పరిస్కారంచేందుకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యం లోనే పట్టణంలో ఉన్న కోతులను అటవీ ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక బృందలను ఏర్పాటు చేశారు.
