డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

  • డిండి చింతపల్లిలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
  • రాములోరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని.. స్వామివారి దర్శించుకున్న గ్రామస్థులు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్ భీష్మ, డిప్యూటీ సర్పంచ్ గంధం సత్యం దంపతులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, యువత పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్షింతలు సమర్పించి సీతారాముల దివ్య దీవెనలు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply