లొద్ది రామన్న జాతరకు ప్రత్యేక బస్సులు..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలం పిప్రి లొద్ది రామన్న జాతర సందర్భంగా ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

ఈ ఏడాది జాతరను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. సిరికొండ మండలం, భీంగల్ మండలం నుంచి లొద్ది వరకు ఈ బస్సులను నడిపించారు.

జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply