ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర..

ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మండలంలో శ్రీ సీతారాముల శోభాయాత్రను మండల “హనుమాన్ భక్త మండలి” ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో గ్రామానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని నామస్మరణతో ఊరంతా మార్మోగించారు. శోభాయాత్రలో భాగంగా భక్తులు కాషాయ పతాకాలు పట్టుకొని, భజనలు చేస్తూ, మంగళహారతులతో శోభాయాత్రను ఆలయం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. చిన్నారులు, యువకులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీ రామనవమిని ఇలాగే భక్తి భావంతో జరుపుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో శాంతి, ఐక్యత కోసం ఈ శోభాయాత్రను నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
