మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి

మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి

ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
విద్యార్థుల కు మెడికల్ అసోసియేషన్ అండగా ఉంటుంది
అసోసియేషన్ ప్రెసిడెంట్ దాచేపల్లి శ్రీను

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మెడికల్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. పట్టణంలోని కమలహాలు సెంటర్లో ఉన్న భవిత స్కూల్ కు జగ్గయ్యపేట నియోజకవర్గ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ స్టవ్ గ్యాస్ బండను అందజేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ మెడికల్ అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సేవలను విస్తృతను పరిచి పలువురు కండగా నిలవాలని కోరారు.

విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరం అని సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చిట్టిబాబు మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాచేపల్లి శ్రీనివాస్ కోశాధికారి డోగుపర్తి రమేష్ ప్రతినిధులు అప్పన మురళి స్వామి దిలీప్ సైదేశ్వర రావు మల్లికార్జునరావు ధర్మారావు పిచ్చయ్య ప్రసాద్ లు పాల్గొన్నారు.

Leave a Reply