నాడు మోడుబారిన మర్రివృక్షం… నేడు కళకళ…

నాడు మోడుబారిన మర్రివృక్షం… నేడు కళకళ…
ఎండిపోయిన చెట్టుకు జీవం పోసిన మజీద్ కమిటీ సభ్యులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పంచ్ మసీదు వద్ద వందల ఏళ్ల నాటి మరి వృక్షం ఎండిపోయి కళా విహీనంగా ఉండగా పంచు మసీదు కమిటీ సభ్యులు వృక్షాన్ని ఎలాగైనా కాపాడాలనే సంకల్పంతో చెట్టు చుట్టు పక్కల మూడు ఫీట్ల మట్టి తవ్వి వివిధ రకాల ఎరువులు ప్రతి నిత్యం నీళ్లు పోయడంతో వేసవికాలంలో ఆ వృక్షానికి ప్రాణం పోసినట్లు అయింది..
పంచు మసీదు వద్ద ఉన్న వృక్షం మోడు బారి ఉండగా ప్రస్తుతం వేసవిలో వృక్షానికి ఆకులు పచ్చదనంతో చిగురించాయి. చల్లదనం ఇవ్వడంతో పాటు పూర్వ వైభవం రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మజీద్ వద్ద ఎంతో కళ గా ఉన్న వృక్షం వేసవిలో ప్రజలకు నీడనివ్వడంతో పాటు చల్లదనం ఇస్తుందని పలువురు ఆంధ్రప్రభ తో ఆనందం వ్యక్తం చేశారు.
