The baby | పసికందుపై తల్లి దారుణం….

The baby | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఎన్‌ఆర్ అగ్రహారంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఇటీవల జన్మించిన ఆడ శిశువును తల్లి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
హేమావతి అనే మహిళ తన పాప తరచూ పాల కోసం ఏడుస్తుండటంతో చిరాకుపడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఆమె ఇదే విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ఇటీవల భర్తతో కూడా హేమావతికి తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్యలు కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
