ఉచిత శిక్షణ దరఖాస్తుకు గడువు పొడిగింపు

ఉచిత శిక్షణ దరఖాస్తుకు గడువు పొడిగింపు
ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.లక్ష్మీదేవి
విజయవాడ, ఆంధ్రప్రభ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్-డికు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించనట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.లక్ష్మీదేవి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన 100 మంది అభ్యర్థులకు రెండు నెలలు పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు బయోడేటాతో పాటు పదో తరగతి మార్కుల జాబితా, కులధ్రువీకరణపత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం (తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షలోపు మాత్రమే), బ్యాంకు పాస్‌బుక్ జిరాక్సు, రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్-డి అంగీకార పత్రం జిరాక్సు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు జతపరిచి ఈ నెల 30వ తేదీలోగా విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం డోర్ నెం.74-2-1/5, అశోక్‌నగర్, పండరీపురం, రోడ్డు నెం.8, విజయవాడ-520007కు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 9966849937, 9505094349, 8688855255లో సంప్రదించాలని డైరెక్టర్ లక్ష్మీదేవి సూచించారు.
