యువత స్వశక్తితో ఎదగి, లక్ష్యం సాధించాలి …

యువత స్వశక్తితో ఎదగి, లక్ష్యం సాధించాలి …
నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు
చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు
డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న నారా భువనేశ్వరి
కుప్పం, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన లో భాగంగా రెండవ రోజు కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని నారా భువనేశ్వరి విద్యార్థులను ఉద్దేశించి ప్రశాంగించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని భవిష్యత్ పై స్పష్టత ఉండాలని ఆమె తెలిపారు .యువత స్వశక్తితో ఎదగి కష్టాన్ని నమ్ముకోని లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చునాని నారా భువనమ్మ పేర్కొన్నారు.
నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే ఏం జరిగిందో గత ఐదేళ్లలో మనం చూశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారని అన్నారు.నేను ఏం చేయగలనో అదే హామీ ఇస్తానని చంద్రబాబు నాతో చెబుతూ ఉంటారని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని ఆమె తెలిపారు.

20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని గృహిణిగా ఉన్న నేను హెరిటేజ్ బాధ్యతల ను సవాల్ గా తీసుకున్నానని జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ప్రతి దానికీ అసంతృప్తికి లోను కాకూడదని కష్టపడి పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని ప్రయోజకులు కావాలని, భవిష్యత్ బాగుండాలని తాపత్రయపడతారని ఆమె పేర్కొన్నారు. పిల్లలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే అని చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నా కుమారుడు లోకేష్ పెంపకం, చదువు బాధ్యత నేనే చూసుకున్నానని ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పి పెంచానని ఆమె తెలిపారు.
