Incident | కూతురికి విషం ఇచ్చి.. తండ్రి ఆత్మహత్యాయత్నం

Incident | కూతురికి విషం ఇచ్చి.. తండ్రి ఆత్మహత్యాయత్నం

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారి తీశాయి. భార్యతో విభేదాల నేపథ్యంలో ఓ తండ్రి అమానుషానికి పాల్పడి చిన్నారికి విషం ఇచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెం గ్రామానికి చెందిన రవి, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా మూడు నెలల క్రితం స్వాతి చిన్న కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తండ్రి వద్దనే ఉండేది.

ఇటీవల పెద్ద కుమార్తెను కూడా తన వద్దకు పంపించాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన రవి, తన పెద్ద కుమార్తెకు సపోటా పండులో విషపదార్థం కలిపి ఇచ్చాడు. అనంతరం తాను కూడా విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply