నేడు గుంటూరుకు గురు శిష్యులు..

నేడు గుంటూరుకు గురు శిష్యులు..
- ఒకే వేదికపైకి రెండు రాష్ట్రాల సీఎంలు
- తెలంగాణ ఏపీ సీఎం ల సమక్షంలో ధూళిపాళ్ల కుటుంబం శుభకార్యం..
- హాజరుకానున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు..
- హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి రాక…
- ఘన స్వాగతానికి విస్తృత ఏర్పాట్లు
విజయవాడ, ఆంధ్రప్రభ : గుంటూరులో నేడు రాజకీయ–సామాజిక ప్రాధాన్యత కలిగిన అరుదైన వేడుక జరగనుంది. పొన్నూరు శాసనసభ్యుడు దూళిపాల నరేంద్ర కుమార్తె వివాహం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. గుంటూరు రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఈ వివాహ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి నేరుగా హెలికాప్టర్లో గుంటూరుకు చేరుకోనుండగా, ఇద్దరు సీఎంలు వేడుకలో గంటకు పైగా గడపనున్నారు. ఇద్దరు సీఎంలు, గురు శిష్యులు ఒకే వేదిక పైకి వస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వివాహ వేడుక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, అతిథుల స్వాగతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానుండటంతో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
