ఎండిపోయిన చెట్టు.. పరిశీలిస్తున్న అధికారులు..

ఎండిపోయిన చెట్టు.. పరిశీలిస్తున్న అధికారులు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ రోడ్లో శివరాం నగర్ లో గల ఎండిపోయిన చెట్టును మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్, నాయకులు మాలే లక్ష్మణ్, వార్డు ఆఫీసులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పక్కన చెట్టు పూర్తిగా ఎండిపోవడం గమనించి ఆయన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ను పిలిచి చెట్టు పరిశీలించి అవసరమైతే తీసివేయాలని సూచించారు.
ఇతరులకు ఇబ్బంది కలగకుండా చెట్టును తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివరాం నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన తడి చెత్త, పొడి చెత్త అవగాహన సదస్సులో విక్రమ్ సింహరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఏసుదాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ ఆర్పీ, విజయ తదితరులు పాల్గొన్నారు.
