గుంతల రోడ్డుతో ఇబ్బందులు

గుంతల రోడ్డుతో ఇబ్బందులు

చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు

టేకుమట్ల,ఆంధ్రప్రభ : ఏళ్ల తరబడి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడం, ఇటీవల కురిసిన వర్షానికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకృష్ణ పూర్ (వి) ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి బురదమయమై అద్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాత్రివేళల్లో సరిగా కనిపించక గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు చేరి బురదతో ఎక్కడ గుంతలున్నాయో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలీని పరిస్థితి నెలకొందిద్విచక్ర వాహనాలను నడపాలంటే వాహనదారులు చంపుతున్నారు. బురదమయంగా ఉండడంతో వాహనాలు నడిపే క్రమంలో జారిపడే పరిస్థితులు ఉన్నాయి. కాగా ఆ దారి గుండా ఇసుక ట్రాక్టర్ నడపడంతో మరింత గుంతల మాయమవుతుంది.

ట్రాక్టర్ల స్పీడ్ తో వాహనదారుల కండ్లలో ఇసుక రేణువులు పాడడం జరుగుతుందని వాహనదారులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply