ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేసింది.
ఎస్సీ, ఎస్టీ నిధుల్లో 70% భారీ కోత
దళిత బందు ఊసే లేదు.
అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు మొండిచేయి.
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని ఎమ్మేల్యే నివాసంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఎస్సీ, ఎస్టీ నాయకులు పసుల ముత్తేన్న,నీరడి భాగ్య, మైలారం సుధాకర్, శర్మ నాయక్,తిరుపతి నాయక్, రాజన్న,గంధం మహిపాల్, మాలవత్ ప్రకాష్, గడలా ప్రసాద్, తుక్కజీ నాయక్, పర్స నవీన్ ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ సబ్బండ వర్గాలను మోసం చేసింది.మూడు బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పి అత్యంత స్వల్పంగా ఖర్చు చేసింది. సబ్ ప్లాన్ అమలును పక్కన పెట్టింది.
అన్నింటికంటే దారుణంగా ఈ సంవత్సరం బడ్జెట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా 70% నిధులను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నిధుల్లోనూ కోత పెట్టింది.70% నిధుల కోత అంటే ఎస్సీ, ఎస్టీ జీవితాల పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి అని చెప్పవచ్చు. ప్రతి ఏటా ప్రతి వర్గానికి నిధులను పెంచిన ప్రభుత్వాలని చూసాము కానీ, మొదటిసారి 37 వేల కోట్ల రూపాయల భారీ నిధులను కోత విధించిన దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది.గత ఏడాది సుమారు 57 వేల కోట్ల రూపాయలు కేటాయించినామని చెప్పుకున్న ప్రభుత్వం, ఈసారి గంప గుత్తగా కేవలం 19 వేల కోట్లు మాత్రమే కేటాయించి 37 వేల కోట్ల రూపాయలను కోత పెట్టింది.ఇది సామాజిక న్యాయం ఏమాత్రం కాదు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి అభివృద్ధిని, భవిష్యత్తును సమాధి చేయడమే.ఇక నిధుల కోత మాత్రమే కాదు, ఎన్నికల ముందు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలులోనూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ఈ చేవెళ్ల డిక్లరేషన్ ఎస్సీ, ఎస్టీలను మూడు సంవత్సరాలలో అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నదని అన్నారు.అంబేద్కర్ అభయ హస్తం కింద కేసీఆర్ ఇస్తున్న10 లక్షలు కాదు,12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్క వ్యక్తికి కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదని అన్నారు.దళిత బంధు పథకంలో ఉన్న10 లక్షలను పక్కన పెట్టింది,12 లక్షల రూపాయల ఊసే ఎత్తడం లేదని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు అని చెప్పి కనీసం దాని గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. పోడు పట్టాల పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమ్మక్క-సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా ప్రతి గూడెం, తాండా, గ్రామ పంచాయితీలకు ప్రతి ఏటా 25 లక్షలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్క గ్రామ పంచాయితీకి 25 పైసలు కూడా ఇవ్వలేదని తెలిపారు.మాల, మాదిగ ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, ప్రతి కార్పొరేషన్ కి 750 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు అని చెప్పి మోసం చేసిందని అన్నారు.
ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు విద్యాజ్యోతిల పథకం
10వ తరగతి పాస్ అయితే 10,000/ ఇంటర్ పాస్15,000/-డిగ్రీ పూర్తి 25,000/-పీజీ, 1,00,000/-ఎంఫిల్, పీహెచ్ఎ 5,00,000/ అందజేస్తామని చెప్పింది.కానీ ఒక్క విద్యార్థికి నయా పైసా ఇప్పటిదాకా చెల్లించలేదని ఇంత దారుణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని, ఎస్సీ,ఎస్టీ బిడ్డలు ఈ అన్యాయాన్ని తిప్పికొడతారని హెచ్చరిస్తున్నారు.ఈ సమావేశంలో తాళ్ళ రాజన్న, జిన్నా శోభన్,సౌడ రమేష్,మోహన్ దాస్,లక్కం నర్సయ్య, కళ్యాణ్,సాయన్న తదితరులు పాల్గొన్నారు..
