Investigation | దర్యాప్తు వేగవంతం

Investigation | దర్యాప్తు వేగవంతం

Investigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ పార్టీ నిర్వహణకు గల కారణాలు, అలాగే కాల్పులు జరగడానికి దారితీసిన పరిణామాలపై సిట్ అధికారులు సవివరంగా ఆరా తీస్తున్నారు.

ఇక డ్రగ్స్ సరఫరా చేసిన అభిషేక్ శర్మతో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై కూడా విచారణ సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.