ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడే జాబ్ మేళా

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మార్చి 24న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు హెటిరో ఫార్మా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, సత్యం స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, విన్సోల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ది ఎంపైర్ గ్రూప్ (ఏ డివిజన్ ఆఫ్ ఇంపల్స్), ప్రతాప్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఎక్స్లరేట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం కంపెనీల ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారని తెలిపారు.

ఈ జాబ్ మేళాకు ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఏదైనా ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లమా, బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, బి.టెక్ విద్యార్హతలు కలిగి తమ బయోడేటా, ఆధార్, , 2 పాస్ ఫోటోలు మరియు విద్యార్హతలు గల పత్రాలతో ఈనెల 24న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ అభ్యర్థులను కోరారు. వివరాలకు
8184809687,9849767362,9948915486 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

Leave a Reply