TG | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..!

TG | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..!

-రూ.3.24 లక్షల కోట్లతో ప్రజా బడ్జెట్..
-అభివృద్ధి, సంక్షేమానికి డబుల్ ఇంజిన్
-రూ.3.24 లక్షల కోట్లతో సమగ్ర ప్రజా బడ్జెట్
-రైతులు, మహిళలు, పేదలకు ప్రాధాన్యం
-ఆర్థిక ఒత్తిడిలోనూ సంక్షేమానికి పెద్దపీట
-సామాజిక సేవలకు రూ.1.06 లక్షల కోట్లు కేటాయింపు
-6 గ్యారంటీలు, ఇందిరమ్మ పథకాలపై రూ.50,713 కోట్లు
-ఇందిరమ్మ భీమాతో 1.15 కోట్ల కుటుంబాలకు అండగా..
-దేవాదుల ప్రాజెక్టుకు నిధులు పెంచితే లక్షల ఎకరాలకు నీరు
-ఘన్‌పూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను
-సాగునీటి అంశంపై అసెంబ్లీలో మాట్లాడనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

TG | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల సమగ్ర బడ్జెట్‌ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలో రైతు లు, మహిళలు, పేదలకు ప్రాధాన్యం కల్పించబడిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో సామాజిక సేవలు, వ్యవసాయ సబ్సిడీలు, పేదల సంక్షేమ పథకాల కోసం రూ 1,06,000 కోట్లకు పైగా కేటాయించినట్లు వివరించారు. అలాగే ఆర్థిక రంగ అభివృ ద్ధికి రూ.74,450 కోట్లు కేటా యించగా, అప్పులపై వడ్డీ చెల్లింపులకు కూడా భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. 6 గ్యారం టీలు, ఇందిరమ్మ పథకాల అమలుకు రూ.50,713 కోట్లు కేటాయించ డం ద్వారా పేదల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

ఇందిరమ్మ భీమా ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు భద్రత కల్పించ నున్నట్టు వెల్లడించారు. రైతు భరోసా, సన్నకారు రైతులకు బోనస్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుకు నిధులు పెంచితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించ నున్నట్లు తెలిపారు. అలాగే ఘన్‌పూర్ అభివృ ద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

-ఆర్థిక ఒత్తిడిలోనూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం :

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో భారీగా అప్పులు చేసినందున ప్రస్తు తం ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే విమర్శించా రు. అప్పుల వడ్డీలు చెల్లిస్తూ కూడా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయ డానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సహ కరించకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప అదనపు సహాయం అందించలేదు. ఒక పెద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కూడా తీసుకురాలేదని విమర్శిం చారు. బీజేపీ తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు..విద్య రంగానికి సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, పాలు, రాగి జావ, మధ్యాహ్న భోజనం అందించనున్నామని చెప్పారు. విధవులకు రూ.2 లక్షల పింఛన్ అందిం చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన ప్రజా బడ్జెట్ అని స్పష్టం చేశారు.

-దేవాదుల దిశగా సాగునీటిపై కడియం ఫోకస్:

అసెంబ్లీలో రేపు (24వ తేదిన)సాగునీటి రంగంపై మాట్లాడబోతున్నాన ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో దేవాదుల ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. దేవాదుల ప్రాజె క్టు పూర్తయితే జనగామ, ఘన్‌పూర్ ప్రాంతాలకు భారీ గా లబ్ధి చేకూరి సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారజోడు రాంబాబు, మార్కె ట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిప ల్ చైర్మన్ తాటి కొండ వినయ్ కుమార్ నాయకులు బెలిదే వెంకన్న, బూర్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply