నిత్యవసర ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలం..

నిత్యవసర ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలం..
అమరావతి ప్రాంతంలో అధిక ధరలకు చికెన్ విక్రయాలు..
చికెన్ ధరలు ఆకాశానంటుతున్నాయి..
రాష్ట్ర వైకాపా పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : నిత్యవసర ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు రాష్ట్ర వైకాపా పార్టీ కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ చిన్న ఆరోపించారు. ఆదివారం ఇంటూరి చిన్న మాట్లాడుతూ చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. నిత్యవసర సరుకులు, వంట నూనెలు, గ్యాస్ తదితర ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారుతున్నాయన్నారు. ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లుగా ఆరోపణ చేశారు.
రాజధాని ప్రాంతంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయని అన్నారు. చికెన్ , నిత్యవసర ధరల నియంత్రణకు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. నిత్యవసర సరుకులు ధరలు గ్యాస్ ధరలు పెరిగి ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కోడి మాంసం ధరలు కేజీ 350 నుండి 400 వరకు పెరిగాయన్నారు. సిండికేట్ గా కొందరు ఏర్పడి అమరావతి ప్రాంతంలో కోళ్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు. ధరల నియంత్రణ చేయాలని లేనిపక్షంలో ప్రజలతో కలసి పార్టీ తరఫున ఆందోళనకు సిద్ధమన్నారు.
