Telangana | అభివృద్ధి జోరు…
Telangana | అభివృద్ధి జోరు…
Telangana | పెండింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అహర్నిశలు కృషి
ఎమ్మెల్యే శ్రీహరి ఆదేశాలతో దూసుకెళ్తున్న అభివృద్ధి
చైర్మన్ వినయ్ కుమార్ పర్యవేక్షణలో వేగవంతమైన పనులు
డ్రైనేజీ నుంచి రోడ్ల వరకు సమగ్ర అభివృద్ధి వైపు స్టేషన్ ఘన్‌పూర్
Telangana | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ఆదేశాలతో అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్ని వార్డు లను సందర్శిస్తూ స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, తాగు నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను గుర్తించి వాటిని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపడుతున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతగా, వేగంగా పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్క డైనా పనుల్లో ఆలస్యం లేదా నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరిస్తున్నారు.
Telangana | ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్న చైర్మన్..
ప్రతి పనిని చైర్మన్ వినయ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Telangana | 11వ వార్డులో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య నాయకత్వంలో మున్సి పల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్ట య్య ఆధ్వర్యంలో 11వ వార్డులో ఆదివారం ప్రత్యేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ సమీపంలో నిల్వైన డ్రైనేజ్ నీటిని తొలగించారు. తూము కాలువ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. ఈ పనులతో స్థానికులకు ఊరట లభించింది. కడియం శ్రీహరి మార్గదర్శకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి. కడియం మార్క్ స్టార్ట్ అయిందని ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తిరుమల నాధ స్వామి దేవ స్థాన చైర్మన్ నీల నరసింహులు, నాయకులు అంబటి కిషన్ రాజు, మునిగేల సంపత్, నీల రాజు, నీల సోమన్న, నీల రాజు, గోనెల రాజకుమార్, నక్క పాపయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, ఏదునూరి సతీష్, నీరటి దామోదర్, నీల పరశురాములు, గుంటి రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.


