రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు

రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు
- దాతలు భక్తుల విరాళాల వెల్లువ
- రాజగోపురం నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోనున్న శివాలయం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణంలో వేంచేసి ఉన్న చారిత్రక శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం దాతల భక్తుల సహకారంతో రూ.50 లక్షలతో జరుగుచున్న రాజగోపుర నిర్మాణం ఇతర అభివృద్ధి పనులతో మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది. ప్రత్యేక పర్వదినాలలో శివాలయం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాలు గమనించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి, అభివృద్ధి కమిటి సభ్యులు శివాలయంలో భక్తుల సౌకర్యార్థం కొన్ని పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

ఆలయం చుట్టు ప్రహరీ గోడ, తూర్పు భాగంలో 3 అంతస్తుల రాజగోపురం, ముందుభాగం ఇరువైపుల ఆర్నమెంట్ వాల్ నిర్మాణం తోపాటు, ఆలయ ప్రాంగణంలో కళావేదిక (కళ్యాణమండపం) యాగశాల, సీసీ రోడ్, టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు గాను భక్తులు దాతల నుంచి విరాళాల సేకరణ చేస్తున్నారు. చారిత్రిక పురాతన దేవాలయం కావడంతో అభివృద్ధిపనులు చేపట్టుటకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే ప్రహరీ నిర్మాణం చేపట్టి రాజగోపురం పనులకు శంకుస్థాపన చేశారు. విరాళాలు ఇచ్చిన దాతలు భక్తుల వివరాలు కన్నెగుండ్ల వెంకటేశ్వర్లు 10లక్షలు, కన్నెగుండ్ల ఆంజనేయులు 5లక్షలు, పేరూరు అశోక్ కుమార్ 5లక్షలు, గుండా శ్రీనివాస్ 2లక్షలు, కుకడపు రామ్మోహన్ రావు 1లక్ష, తొడుపునూరి శేఖర్1 లక్ష, కీతా మల్లికార్జున్ 1లక్ష, దోసపాటి నరసింహమూర్తి 1 లక్ష, శ్రీరామ్ వెంకన్న1లక్ష, ఏలూరు రాంబాబు 1 లక్ష, ఓరుగంటి నరసింహారావు 50వేలు, కౌన్సిలర్ వల్లెపు నాగరాజు 50వేలు అందజేసినట్లు శివాలయం ఈఓ గుజ్జుల కొండారెడ్డి ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు గజ్జి ప్రభాకర్ గుండా శ్రీనివాస్ కీత మల్లికార్జున్ చిన్నం సురేష్ శీలం సైదులు కంచర్ల శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కి సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తులందరూ స్పందించి వారి యొక్క దాతృత్వాన్ని ప్రకటించి శివాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
