నో స్టాక్ పెట్రోల్ బంకు క్లోజ్….

నో స్టాక్ పెట్రోల్ బంకు క్లోజ్….
పెట్రోల్ దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
సంబంధిత శాఖ అధికారులు కొరత లేకుండా చూడాలని కోరుతున్న వాహనదారులు.
నవాబ్ పేట్, ఆంధ్రప్రభ : నవాబ్ పేట్ మండల కేంద్రంలో పెట్రోల్ కొరత ఏర్పడింది.బంకులకు వెళ్లిన ప్రజలకు “స్టాక్ లేదు”అనే సమాధానం తప్ప మరొకటి లభించడం లేదు. ఇండియన్ ఆయిల్,భారత్ పెట్రోలియం అనే రెండు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యాజమాన్యాలు చేతులెత్తేసి బంకులను మూసేసి నోస్టాక్ బోర్డులు పెట్టేశాయి.
దింతో ఆదివారం పెట్రోల్ బంకుకు వెళ్లిన వాహనదారులు నో స్టాక్ బోర్డు చూసి ఒక్కసారిగా షాక్ గురైయ్యారు.గ్రామాలల్లో ఉన్న దుకాణాల్లో పెట్రోల్ అమ్ముతున్న వారి దగ్గర కూడా పెట్రోల్ అందుబాటులో లేదని, ఉన్న అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు చెమురు వంట గ్యాస్ కొరత ఏర్పడిందన్న వదంతులను ఎవ్వరు నమ్మవద్దని పదే పదే చెబుతున్నప్పటికీ అది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందని వాహనదారులు అంటున్నారు.
క్షేత్రస్థాయిలో చూసినట్లయితే చమురు,వంటగ్యాస్ కొరత ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పెట్రోల్ బ్యాంకుకు సంబంధించిన మెంటనెన్స్ దారులను అడగగా రెండు రోజులు సెలవు దినాలు ఉండడంతో పెట్రోల్ కొరత ఏర్పడిందని సోమవారం సాయంత్రం వరకు పెట్రోల్ వస్తుందని వారు చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పెట్రోల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
