Cool drinks | అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే…

Cool drinks | అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే…
Cool drinks | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడానికి కాసేపు ఉపశమనం పొందడానికి చాలా మంది కూల్‌డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మనం తాగే ఒక చిన్న కూల్‌డ్రింక్ బాటిల్‌లో చక్కెర పరిమితి చాలా ఎక్కువ ఉండటం వల్ల అది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. దీనివల్ల తక్కువ కాలంలోనే డయాబెటిస్ బారినపడే అవకాశం ఉంటుంది.
Cool drinks | శరీర బరువు, ఊబకాయం :

కూల్‌డ్రింక్స్‌లో పోషక విలువలు ఉండవు. అందుకే వీటిని ఎంప్టీ క్యాలరీస్ అంటారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాన్ (పొట్ట దగ్గర కొవ్వు) పెరగడానికి ఇవి ప్రధాన కారణమవుతాయి. అందుకే ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు కూల్‌డ్రింక్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Cool drinks | డయాబెటీస్ రోగులు :

కూల్‌డ్రింక్స్ విషయంలో డయాబెటీస్‌తో బాధపడే వారు దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్‌లో చక్కెర పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. డయాబెటీస్ రోగులు శీతలపానీయాలు తాగితే అది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఉదర సంబంధిత సమస్యలు :

ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి లేదా అల్సర్ వంటి సమస్యలు సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడం మనకు చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే..
ఎముకలు, దంతాలపై ప్రభావం :

కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్పరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు క్రమంగా బలహీనపడి, చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా… సాఫ్ట్ డ్రింక్స్‌లో కార్బోనిక్ యాసిడ్ దంతాల పై పొరను కరిగించి, పిప్ప పళ్లు, చిగుళ్ల వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
కిడ్నీలపై ప్రభావం :

అధిక సాంద్రత కలిగిన రసాయనాలు, కృత్రిమ రంగులు కిడ్నీలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. దీర్ఘకాలంగా ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి లేదా కిడ్నీ పనితీరు మందగించడానికి కారణం కావచ్చు.
సహజసిద్ధమైన పానీయాలే మేలు :

వేసవి తాపం నుంచి రక్షణ పొందడానికి కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సహజసిద్ధమైన పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరినీళ్లు ఎంతో మంచిది. ఇందులో ఉండే సహజమైన ఎలక్ర్టోలైట్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. నిమ్మరసం తక్కువ చక్కెరతో తీసుకుంటే విటమిన్-సి అంది తక్షణ శక్తిని ఇస్తుంది. రాగి జావ ఎండదెబ్బ తగలకుండా కాపాడటం సహా ఎముకలకు బలాన్నిస్తుంది.
CLICK HERE TO READ MORE : 40YRS |సన్నగా, ఫిట్‌గా ఉండటానికి మార్గదర్శకాలు
