భక్తసమాజం ఆధ్వర్యంలో అన్న వితరణ
భక్తసమాజం ఆధ్వర్యంలో అన్న వితరణ
కేదారేశ్వర పేట, ఆంధ్ర ప్రభ : గోవిందమాల భక్తసమాజం గోవిందగురు స్వామి ఏనుగుల వెంకట గాంధీ బాబు ఆధ్వర్యంలో శనివారం కమిటీ సభ్యులు పుప్పాల అప్పారావు చేతుల మీదుగా పూజ కార్యక్రమం అనంతరం పాత గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. గత ఆరు సంవత్సరాలుగా అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
దాతసానికొమ్ము ప్రసాద్ రెడ్డి సహకారంతో అన్నవితరణ చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏనుగుల వెంకట శ్రీనివాస్, గోపి చందన సురేష్, గద్దల ధనలక్ష్మి, దత్తి జ్యోతి, పబతి కృష్ణ, యర్రంశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
