ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..

ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా

పాయకాపురం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం, మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి తో ఉన్నారని తెలిపారు. ఇమామ్‌లు మరియు మౌజన్‌ల గౌరవ వేతనాలు రూపొందించి అమలు చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

రంజాన్ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మాసం అని అన్నారు. గత నెల రోజులు పాటు తెల్లవారుజాము నుండి సూర్య అస్తమయం వరకు ఆహార పానీయాలు లేకుండా కఠినమైన ఉపవాసాలు ఉంటూ దానధర్మాలు చేస్తారనీ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించిందని ముస్లింల నమ్మకం గా పేర్కొన్నారు.

గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవాడ నగరంలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తారు విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అన్నారు.

Leave a Reply