జిల్లా రైతు సంఘం కోశాధికారిగా కంపే దుర్గయ్య ఎన్నిక

జిల్లా రైతు సంఘం కోశాధికారిగా కంపే దుర్గయ్య ఎన్నిక

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని వెల్మకన్నె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసి కంపే దుర్గయ్యను శుక్రవారం జిల్లా రైతు సంఘం సమావేశంలో జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో దుర్గయ్య గతంలో చేసిన సేవలను గుర్తించి ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యానికి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుజ్జ రామచంద్రానికి, సిపిఐ మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక పట్ల సిపిఐ నాయకులు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.