జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ
జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా క్రికెట్ పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి.ఛత్రపతి శివాజీ టీం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నియోజకవర్గ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పరి అశోక్ సాగర్, గ్రామానికి చెందిన గువ్వల తిరుపతి విజేతలకు బహుమతులు అందించనున్నారు .పోటీలు రెండవ రోజైన శుక్రవారం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పరి అశోక్ సాగర్ ఐదు టీమ్లకు గాను మొత్తం 75 మంది ప్లేయర్లకు తన సొంత ఖర్చులతో జెర్సీలను అందజేశారు.
అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు .పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారు కూడా క్రీడా స్ఫూర్తితో పోటీల్లో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతుంటాయి అన్నారు.

నేటి ఓటమి కూడా రేపటి విజయానికి సోపానంగా భావించాలని ఆయన క్రీడాకారులకు సూచించారు .పోటీలో పాల్గొనే క్రీడాకారులు నిర్వాహకుల సూచనలు పాటించాలని అన్నారు. ఎం పి ఎల్ క్రికెట్ టోర్నీలో విన్నర్ గా నిలిచిన జట్టుకు రూ.15000తోపాటు ట్రోఫీ అందజేయడం జరుగుతుందని అశోక్ సాగర్ తెలియజేశారు.రన్నర్ గా నిలిచిన జట్టుకు రూ.10000 నగదు ట్రోఫీ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోటీల్లో పాల్గొన్న వారంతా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గువ్వల తిరుపతి, పాల కృష్ణయ్య ,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
