జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వెలగపూడి గోపాల్

వర్ని, ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా వర్ని కిచెందిన వెలగపూడి గోపాల్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేశారు. వర్ని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గా గోపాల్ రైతులకు పార్టీకి అనేక సేవలందించారు.

రైతుల సంక్షేమం కోసం గోపాల్ చేసిన సేవలను గుర్తించి జిల్లా కార్యదర్శిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు పార్టీ అధిష్టానం గోపాల్ ను కార్యదర్శిగా నియమించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని గోపాల్ అన్నారు.