రంజాన్ కానుకలు..
రంజాన్ కానుకలు..
-ముస్లిం సోదరులకు ఈద్ కానుకలు అందజేత
-పాల్గొన్న సర్పంచ్ మంతెన హరిత ఇంద్రసేనారెడ్డి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామంలో గురువారం రాత్రి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈద్-కా-తోహఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ మసీదులో జరిగిన కార్యక్రమానికి సర్పంచ్ మంతెన హరిత ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు రంజాన్ నెలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించడం వారి ఆధ్యాత్మికతకు నిదర్శమని తెలిపారు. పండుగల ద్వారా సామరస్యాన్ని పెంపొందించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలు పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ మాచర్ల కుమారస్వామి, వార్డు సభ్యుడు ఆకుల కృష్ణంరాజు, మంతెన హరీష్, ఉడుత భిక్షపతి, గాదె భాస్కర్, మంద వెంకట నర్సు, ముస్లిం సోదరులు ఎండి యాకూబ్, ఎండి గౌస్, ఎండి సయ్యద్, ఎండి జలీల్, ఎండి షంషీర్, ఎండి కాసిం, ఎండి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
