అందుకే.. టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా..

అందుకే.. టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా..

  • రంజాన్ సెలవు మార్పు..
  • ప్రభుత్వ ఉత్తర్వులు జారీ..
  • ఏప్రిల్ 2న ఆంగ్ల పరీక్ష నిర్వహణ..
  • 21 న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రంజాన్ పండుగ సెలవు తేదీ మార్పుతో పదో తరగతి విద్యార్థుల పై ప్రభావం పడింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ రేపటిని సాధారణ సెలవుగా ప్రకటించింది. దీంతో అదే రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వాయిదా పడిన ఆంగ్ల పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మిగతా అన్ని పరీక్షలు కొనసాగుతాయని, చివరిగా ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.

రంజాన్ పండుగ తేదీ పై వక్ఫ్ బోర్డు సీఈఓ పంపిన లేఖ ఆధారంగా సెలవు తేదీని సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అమలులోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను పునఃవ్యవస్థీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా కొత్త షెడ్యూల్‌ను గమనించాలని అధికారులు సూచించారు.